ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో దళారులను నమ్మొద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని తన నివాసంలో 30 మందికిపైగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, తహసీల్దార్ హాజరయ్యారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చారని.. వాటి వల్ల పేద ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్ పథకం వృద్ధులకు ఎంతగానో సహాయపడుతోందని వివరించారు.
ఇదీ చూడండి: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట.. టెండర్ల నిలిపివేత