ETV Bharat / state

గాడిద పాలకు భలే గిరాకి - కళ్యాణదుర్గంలో గాడిద పాలతో రోజుకు రెండు వేలు సంపాదిస్తున్న బృందం

గేదె, ఆవు, మేక పాల వ్యాపారం మనకు బాగా తెలుసు. అందుకు భిన్నంగా గాడిద పాలు అమ్ముకుంటూ రోజుకు రూ. 2 వేలు సంపాదిస్తుందో బృందం. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన ముప్పై మంది సభ్యులు.. ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వీధుల వెంట తిరుగుతూ ఈ వ్యాపారానికి తెర తీశారు.

గాడిద పాలకు భలే గిరాకి
గాడిద పాలకు భలే గిరాకి
author img

By

Published : Dec 27, 2020, 11:04 PM IST

గాడిద పాలకు భలే గిరాకి

చిన్న పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ.. ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గాడిద పాలను విక్రయిస్తున్నారు కొందరు వ్యక్తులు. నిజామాబాద్​కు చెందిన 30 మంది సభ్యుల బృందం.. కర్ణాటక, ఏపీల్లోని వివిధ పట్టణాల్లో గాడిదలతో వీధుల్లో తిరుగుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. 5 నుంచి 10 మిల్లీ లీటర్ల నాణ్యమైన గాడిద పాలను వంద రూపాయల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

గాడిద పాలు తాగితే చిన్న పిల్లలకు వచ్చే పలు రోగాలు దూరమై.. ఆకలి ఎక్కువవుతుందనే నమ్మకం అనేక ప్రాంతాల్లో ఉంది. వీటిని 'చురుకు పాలు'గా పలుచోట్ల వ్యవహరిస్తారు. ఖరీదు ఎక్కువైనా.. అరుదుగా దొరికే ఈ పాలను ఒక్కసారైనా చిన్నారులకు ఇవ్వాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. ఇటువంటి వారి ద్వారానైనా.. తమ కోరిక నెరవేరుతోందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సినీ రంగంలో "అనంత" కళాకారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.