ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు. హార్ట్ ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్స్ కోటిన్నర రూపాయల విరాళాన్ని అందించింది. చెక్కును కమలేష్ పటేల్ తరపున సంస్థ సంయుక్త కార్యదర్శి వంశీ చల్లగుల్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. మంత్రి కేటీఆర్కు పలువురు చెక్కులు అందించారు. 13 మంది సుమారు కోటి 15 లక్షల రూపాయల విరాళాలను అందించారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 30 లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ 25 లక్షలు, చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ 25 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్కు అందించింది.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది'