కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ వంతు సహాయంగా పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. సికింద్రాబాద్ జూవెల్లర్స్ ఆధ్వర్యంలో రూ. 31 లక్షలు, జీఆర్టీ జువెల్లర్స్ రూ. 29 లక్షలు, ఏషియన్ గ్రూప్- రూ. 21 లక్షల విరాళాలు అందించారు. ఈ మేరకు పురపాలక మంత్రి కేటీఆర్కు చెక్కులను అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం