ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం మరయ్యపాడు గిరిజన గ్రామానికి చెందిన ఓ గర్భిణిని.. స్థానికులు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోశారు. మైదాన ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్‌లో భోగవలస పీహెచ్‌సీకి చేర్చారు.
అనంతరం ఆమె బాబుకి జన్మనిచ్చింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు మొరపెట్టుకుంటున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని గ్రామస్థులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: SureshRaina: క్రికెటర్ రైనా బయోపిక్‌లో సూర్య?