ETV Bharat / state

దహనం కాని మృతదేహాలు.. పీక్కు తింటున్న శునకాలు - కుక్కలు తింటున్న కరోనా మృతదేహాలు

అంతిమ సంస్కారం అనే మాటనే ఇప్పుడు వాడలేని పరిస్థితి ఏర్పడింది. ‘ఆస్తిపాస్తులు కావు వెంట వచ్చేది ఆ నలుగురే’ అన్న మాటకూ అర్థం మారిపోతోంది. తమ వారెవరో, ఎక్కడున్నారో, కనీసం ఏ చితిపై కాలుతున్నారో గుర్తించలేని దయనీయ స్థితి నెలకొంది. శ్మశానానికి బాధితుల సంబంధీకులు రాకపోవడం, కాటికాపరులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో చాలా మృతదేహాలు పూర్తిగా కాలడం లేదు. సగం కాలిన శరీర భాగాలను శునకాలు పీక్కుతింటున్న హృదయ విదారక దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి.

corona virus
corona virus
author img

By

Published : Jul 12, 2020, 6:59 AM IST

ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం.. అన్నట్లుగా కరోనా మరణాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ తమ కుటుంబంలో ఒకరై, మంచి చెడులకు, ఎదుగుదలకు బాధ్యులైన వారు విధివశాత్తూ అసువులు బాస్తే కడచూపు కోసం తపించని వారుండరు. దూర తీరాల్లో ఉన్న ఆప్తుల కోసం మూడు నాలుగు రోజుల పాటు మృతదేహాలను భద్ర పరచడం సాధారణమే. విదేశాల్లో మరణించిన వారి భౌతికకాయాల కోసం నెలల తరబడి ఎదురుచూడటం మామూలే. తమ వారి మృతదేహాలను తెప్పించండి అంటూ అధికారులు, నేతలను వేడుకునే వారెందరో. తమ తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అన్ని క్రతువులను పూర్తిచేసి సగౌరవంగా సాగనంపడం ఒక సంస్కారం. కానీ...కరోనా మహమ్మారి ఈ అన్నింటినీ మటుమాయం చేస్తోంది. క్రతువులు కాదు కదా మృతదేహాలను కనీసం చూడలేని దుస్థితిని తీసుకొచ్చింది. జంతువుల కళేబరాలను వదిలించుకునే రీతిలో సామూహిక ఖననాలు, దహనాలు జరుగుతున్న తీరు కలవరపరుస్తోంది.

సామూహిక దహనం

హైదరాబాద్‌ ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో నిత్యం కాలుతున్న కాష్టాలను చూస్తే కఠినాత్ములు కూడా కన్నీరు పెట్టాల్సిందే. ఇక్కడ ప్రతి రోజూ పదికి పైగానే కరోనా మృతదేహాలను ఇక్కడ దహనం చేస్తున్నారు. శుక్రవారం ఒకే రోజు 38 మందిని ఇక్కడ సామూహిక దహనం చేశారు. వీరిలో కరోనాతో చనిపోయిన వారు కొందరైతే, అనుమానిత లక్షణాలతో అసువులు బాసిన మరికొందరు ఉన్నారు. సాధారణంగా మృతి చెందిన వారిని ఇక్కడికి తీసుకురావడానికే జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తమవారి కోసం..

కరోనా సోకి లేదా అనుమానిత లక్షణాలతో గాంధీ, ఇతర ప్రభుత్వాసుపత్రులతోపాటు ప్రైవేటు దవాఖానాల్లో మృతి చెందిన వారిని ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికకు తీసుకువచ్చి దహనం చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా స్థానికులు అంగీకరించకపోవడంతో ఈఎస్‌ఐ సమీపంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఆయా ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌ల్లో ప్యాక్‌ చేసి తీసుకువస్తున్న మృతదేహాలను ఇక్కడ కుప్పలుగా కాల్చేస్తున్నారు. కుటుంబ సభ్యులు జాగ్రత్తల మధ్య దూరం నుంచే అంతిమ సంస్కారాలను చూస్తూ.. తమ వారి చితి ఎక్కడుందోనని విలపిస్తున్నారు.

అడ్డా కూలీల సాయంతో..

కరోనా లేదా అనుమానిత లక్షణాలతో చనిపోయిన వారి మృతదేహాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వారిని దహనం చేసే ఏర్పాట్లు తగిన విధంగా చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థలం చాలకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా, షెడ్లలో, తుప్పల్లో, పొదల మధ్య ఎక్కడపడితే అక్కడ చితి పేర్చి మృతదేహాలకు నిప్పు పెడుతున్నారు. శ్మశానవాటికలో దహన సంస్కారాల నిమిత్తం కేవలం ఆరుగురు సిబ్బందే పనిచేస్తున్నారు. అనంతరం చితుల్లోని బూడిద ఎత్తివేసి శుభ్రం చేసేందుకు ప్రతి రోజూ అడ్డాపై కూలీలను తీసుకొస్తుండటం దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా మృతుల అంత్యక్రియలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి అవసరమైన ఏర్పాట్లుచేయాల్సిన అవసరముంది.

సామూహిక దహనాలు

ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా మృతులు ఈఎస్‌ఐ శ్మశానవాటికకు వస్తుండటంతో వాటిని సామూహికంగా దహనం చేయడం కూడా ఇక్కడి సిబ్బందికి కష్టమవుతోంది. పెద్ద సంఖ్యలో చితులను పేర్చి, మృతదేహాలపై డీజిల్‌ చల్లి మంటపెడుతున్నారు. బాధితుల సంబంధీకులు రాకపోవడం, కాటికాపరులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో చాలా మృతదేహాలు పూర్తిగా కాలడం లేదు. వర్షం వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతి రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ కరోనా మృతులను దహనం చేస్తున్నారు. సగం కాలిన శరీర భాగాలను ఉదయం శునకాలు పీక్కుతింటున్న హృదయ విదారక దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.