ETV Bharat / state

వీధికుక్కల స్వైరవిహారం.. హైదరాబాద్​లో మరో బాలుడిపై దాడి

Dogs Attack Boy in Chaitanyapuri: హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అంబర్​పేట్​ ఘటన మరవక ముందే చైతన్యపురి, రాజేంద్ర నగర్​లో మరో 2 ఘటనలు వెలుగుచూశాయి. చైతన్యపురిలో నాలుగేళ్ల బాలుడిపై, రాజేంద్రనగర్​లో ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో బల్దియా సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారని నగరవాసులు కోరుతున్నారు.

Dogs Attack Boy in Chaitanyapuri
Dogs Attack Boy in Chaitanyapuri
author img

By

Published : Feb 22, 2023, 11:38 AM IST

Updated : Feb 22, 2023, 3:30 PM IST

Dogs Attack Boy in Chaitanyapuri: హైదరాబాద్​లో వీధి కుక్కలు విరుచుకుపడుతున్నాయి. శునకాల దాడిలో అంబర్​పేట్​లో నాలుగేళ్ల బాలుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరిన్నీ దాడి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

నగరంలోని చైతన్యపురిలో మారుతి నగర్​ రోడ్​ నెంబర్ 19 జైన్ మందిర్ వద్ద సోమవారం రాత్రి నాలుగేళ్ల బాలుడు(రిషి)పైన వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి కేకలు విని కుక్కలను తల్లిదండ్రులు, కాలనీవాసులు పరిగెత్తుకెళ్లారు. కుక్కలు బాలుడిపై పడి పీక్కుతినం గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న రాళ్లు, కర్రలతో కుక్కలను తరిమికొట్టారు.

తాజాగా రాజేంద్రనగర్ హైదర్​గూడ ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వరుసగా ఐదు మందిపై దాడి చేసి గాయపరిచాయి. అదే ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని శునకం చెయ్యి పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లింది. కింద పడేసి నెత్తిపై విచక్షణారహితంగా కరిచాయి. అడ్డుకోవడానికి యత్నించిన మరో బాలుడిపై కూడా దాడి చేశాయి. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారికి చికిత్స చేయించారు.

Stray Dogs Rampant In Karimnagar District:కరీంనగర్‌ జిల్లాలో వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. శంకరపట్నం మండల కేంద్రంలో ఎస్సీ బాలుర వసతి గృహంలోకి కుక్క చొరబడింది. అక్కడే ఉన్న విద్యార్థి పిన్‌రెడ్డి సతీష్‌రెడ్డిపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Stray Dogs Are Causing Panic In Karimnagar District: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీని గురించి ఎన్నోసార్లు మున్సిపాలిటీ వాళ్లకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని, గతంలో వెంబడించినప్పుడు ఫిర్యాదు చేసి కుక్కలను పట్టించినా.. కొంతమంది కాలనీవాసులు వాటిని విడిపించి, వాటికి ఆహారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రింత ఇదే ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ విద్యార్థి కూడా గాయపడ్డాడు. మరో ఘటనలో కుక్కలు వెంటపడటంతో ఓ వృద్ధుడు తీవ్రగాయాల పాలయ్యాడు.

వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యేసయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కులు వెంటపడ్డాయి. ద్విచక్ర వాహనంపై నుంచి యేసయ్య కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వీధికుక్కల స్వైరవిహారం

ఇవీ చదవండి:

Last Updated : Feb 22, 2023, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.