హైదరాబాద్ నగరంలో గత రెండు మూడు రోజులుగా కుక్కల దాడులు పెరిగాయి. ఆదివారం లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కాలనీలో కూడా ఓ పిచ్చి కుక్క నలుగురు చిన్నారులపై తీవ్రంగా దాడికి పాల్పడింది.
ఈరోజు టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ నగర్లో పిచ్చి కుక్కలు వీరంగం సృష్టించాయి. నలుగురు చిన్నారులపై దాడికి తెగబడ్డాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఇది ముమ్మాటికీ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: నలుగురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి... తీవ్రగాయాలు