ETV Bharat / state

వీధి కుక్కల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం.. - Dog Attack on boy in hyderabad

Dog Attacks Increased in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా కుక్కల దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.

Dog Attacks
Dog Attacks
author img

By

Published : Mar 31, 2023, 2:43 PM IST

Dog Attacks Increased in Telangana : రాష్ట్రంలో కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇటీవల కాలంలో మరీ ఎక్కువైన శునకాల దాడులతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ వైపుగా ఏ కుక్క దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుంటున్నారు. దాదాపు 2 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్న వీధి శునకాలు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి.

ఈ కుక్కల దాడిలో హైదరాబాద్​లో ఇటీవల ఓ బాలుడు ప్రాణాలు సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో అప్రమత్తమైన జీహెచ్​ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. కుక్కల బెడదను కాస్త తగ్గించినా.. పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కుక్క కాటుకు బలవుతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా కుత్బుల్లాపూర్​లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. సూరారం కాలనీలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.

సూరారంలోని రాజీవ్ గృహకల్పకు చెందిన ప్రేమ్ అనే బాలుడిపై దాడి చేసిన శునకాలు.. తీవ్రంగా గాయపరిచాయి. గాజుల రామారాంలోని చెన్న కేశవ కాలనీలోనూ ఓ బాలికపై దాడి చేశాయి. అన్విత అనే బాలిక గురువారం ఉదయం కిరాణా దుకాణానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కలు మీదపడి శరీరం మొత్తం గాయాలు చేశాయి. దీంతో అన్విత తల్లిదండ్రులు వెంటనే షాపూర్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా వీధి కుక్కలపై సరైన చర్యలు తీసుకోవడంలో మున్సిపాలిటీ అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా కుక్కలు దాడి చేస్తుండటంతో భయం భయంగా కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిచ్చి కుక్క స్వైర విహారం..: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్​లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై మీ సేవకు వెళ్తోంది. ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చి కుక్క.. వాహనాన్ని వెంబడించి మరీ వృద్ధురాలిపై దాడి చేసింది. ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో ప్రథమ చికిత్స అందించి వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ అధికారులు స్పందించి.. వీధి కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి..

వీధి కుక్కల దాడి- రెండున్నర ఏళ్ల చిన్నారి మృతి

Video Viral : అమ్మాయి కనిపించగానే.. కుక్క పిక్క లాగేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.