తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎంసీ బిల్లు, వైద్య రంగంలో వస్తోన్న మార్పులపై హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెజస అధ్యక్షులు కోదండరాం, ఆచార్య హరగోపాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
ఎన్ఎంసీ అనేది కేవలం రెగ్యులేటరీ వ్యవస్థ మాత్రమేనని దానికి నిర్ణయాధికారం లేదని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నందున స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. జాతీయ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి అధికారాలన్నీ వారి అధీనంలోనే ఉండేలా చూస్తున్నారని ఆచార్య హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా నూతన చట్టాలు తీసుకొస్తున్నప్పుడు సుధీర్ఘమైన చర్చలు జరగాలని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. మన దేశంలో వైద్యుల సంఖ్య తక్కువుగా ఉందని ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఇవీ చూడండి : 'రైడ్ ఈజీ యాప్ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి'