కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన డా.నరేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభోద్ కోరారు. అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు డా.నరేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. అతని మరణం తనకు ఎంతగానో కలిచివేసిందని ఆయన వాపోయారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది