తలసేమియా వంటి వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రముఖ చిన్న పిల్లల వైద్యనిపుణురాలు డాక్టర్ శిరీషరాణి అభిప్రాయపడ్డారు. తలసేమియా వ్యాధి వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే దానికంటే... రాకముందే వ్యాధిని అరికట్టడం చాలా ముఖ్యమన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలను ఆమె వివరించారు.
ఈ వ్యాధి అనేది రెండు రకాలుగా ఉంటుందని... మొదటి దశలోనే గుర్తించడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చని ఆమె చెప్పారు. ఇందు కోసం మహిళలు గర్భం ధరించిన్నప్పుడే కొన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: రైల్వే టికెట్ ధరలు పెంపు... ఎందుకు? ఎంత?