ETV Bharat / state

ఫోన్ చేసి ఆమ్లెట్​ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు - doctor sexual arrashment on nurse in nellore news

ప్రభుత్వ ఆస్పత్రిలో అతనో డాక్టర్. నలుగురికి సేవ చేసే వృత్తిలో ఉన్న ఆ వైద్యుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. తాను పనిచేసే వైద్యశాలలో ఓ నర్సుపై కన్నేశాడు. లైంగిక కోరిక తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. వారు అతగాడికి దేహాశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Doctor Sexual Assault on Nurse in nellore district
Doctor Sexual Assault on Nurse in nellore districtDoctor Sexual Assault on Nurse in nellore district
author img

By

Published : Feb 12, 2020, 3:21 PM IST

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న ఆడవారిపై వేధింపులు ఆగట్లేదు. తాజాగా మహిళపై వేధింపుల ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. నలుగురికి సేవ చేసే వైద్య వృత్తిలో ఉన్న వైద్యుడే... తన దగ్గర పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. స్టాఫ్​నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే...?

నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ్రాయింగ్ అధికారి డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్... విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్​నర్సుకు ఫోన్ చేశాడు. ఆమ్లెట్ వేసి వైద్యశాలకు తీసుకురావాలని కోరాడు. ఆస్పత్రిలో పనిచేసే అటెండర్​కు చెప్పొచ్చు కదా అని నర్సు బదులిచ్చింది. లేదు నువ్వే తీసుకురావాలని చెప్పాడు డాక్టర్. ఆయన చెప్పినట్లే ఆమ్లెట్ వేసుకొని వైద్యశాలకు వచ్చిన స్టాఫ్​నర్స్ డాక్టర్ గదిలోకి వెళ్లింది.

నువ్వంటే ఇష్టమని... తన కోరిక తీర్చాలంటూ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిరాకరించిన నర్సు అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయింది. జరిగిన విషయాన్ని భర్తతో పాటు ఆమె సోదరుడికి ఫోన్ చేసి వివరించింది. ఆస్పత్రికి వచ్చిన కుటుంబసభ్యులు డాక్టర్​పై దాడి చేశారు. దేహాశుద్ధి చేసి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తమను కూడా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడంటూ పలువురు నర్సులు వాపోయారు.

ఫోన్ చేసి ఆమ్లేట్​ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు

ఇదీ చదవండి : దినదినగండం.. మృత్యువుతో పోరాటం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.