ETV Bharat / state

13 శాతం క్షీణించిన డాక్టర్ రెడ్డీస్ తొలి త్రైమాసిక నికరలాభం - yderabad news

ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తన మొదటి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. లాక్​డౌన్​ ప్రభావం వల్ల 13 శాతం క్షీణించినా... రూ.579 కోట్లు రాబట్టినట్లు కంపెనీ​ సీఈవో షౌమన్​ చక్రబోర్తి వివరించారు. ఇయర్ ఆన్ ఇయర్ 15 శాతం వృద్ధితో మొత్తంగా రూ.4426 కోట్ల రెవెన్యూను డాక్టర్ రెడ్డీస్ ఆర్జించిందని ప్రకటించారు.

మొదటి క్వార్టర్​లో రూ.579 కోట్లు రాబట్టిన డాక్టర్​ రెడ్డీస్​

author img

By

Published : Jul 29, 2020, 8:57 PM IST

Updated : Jul 29, 2020, 9:22 PM IST

ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తన మొదటి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కొవిడ్ ప్రభావంతో ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి 13 శాతం క్షీణించి... మొదటి త్రైమాసికంలో రూ.579 కోట్ల రాబడిని డాక్టర్ రెడ్డీస్ నమోదు చేసింది. లాక్​డౌన్ వల్ల ఆసుపత్రుల్లో పేషంట్ ఫుట్ ఫాల్ పడిపోవటం వల్ల దేశీయంగా డ్రగ్స్ డిమాండ్ తగ్గిందని కంపెనీ సీఈవో షౌమన్ చక్రబోర్తి తెలిపారు. అయినా.. ఇయర్ ఆన్ ఇయర్ 15 శాతం వృద్ధితో మొత్తంగా రూ.4426 కోట్ల రెవెన్యూను డాక్టర్ రెడ్డీస్ ఆర్జించిందని ప్రకటించారు.

కొవిడ్ ప్రభావంతో కొన్ని చోట్ల వ్యాపారం మందగించినా.. పాండమిక్ తెచ్చిన డిమాండ్​తో మరికొన్ని చోట్ల చక్కని వృద్ధి నమోదు చేసినట్లు చక్రబోర్తి వివరించారు. ఆర్ అండ్ డీ పై ఈ త్రైమాసింకంలో రూ.398 కోట్లు ఖర్చు చేయగా.. 9 శాతం రెవెన్యూ సాధించామన్నారు. ఈ త్రైమాసికంతో కంపెనీ నాలుగు కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయగా.. కొవిడ్ డ్రగ్స్ అయిన అవిగాన్, రెమిడెసివిర్ డ్రగ్స్ లాంఛింగ్ దశలో ఉన్నాయని.. ఇందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. రష్యాలో ఈసారి 17 శాతం తక్కువ మార్కెట్ జరిగిందని తెలిపారు. ఎమర్జింగ్ మార్కెట్లు, బలమైన మార్కెట్ యూరప్ తదితర ప్రాంతాల్లో కంపెనీ చక్కని వృద్ధిని నమోదు చేసిందని చక్రబోర్తి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

Last Updated : Jul 29, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.