జ్వరం రాగానే భయాందోళనకు గురికావొద్దని , ముఖ్యంగా డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని నీలోఫర్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ లాలూ ప్రసాద్ అన్నారు. తగిన మందులు, అధికంగా నీరును తాగితే సరిపోతుందని తెలిపారు. కొందరు తలనొప్పి, జ్వరం వస్తే చాలు అనుమానంతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని పేర్కొన్నారు. తీవ్రత పెరిగితే ఆసుపత్రిని ఆశ్రయించాలని సూచించారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు డెంగీ జ్వరం వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివరించారు.
జ్వరం రాగానే భయాందోళనకు గురికాకండి - నీలోఫర్ ఆసుపత్రి
జ్వరం రాగానే డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని నిలోఫర్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ లాలు ప్రసాద్ అన్నారు. తగు మందులు, జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తగ్గుతుందని..తీవ్రత పెరిగితేనే ఆసుపత్రులను ఆశ్రయించాలని ఆయన ప్రజలకు సూచించారు.