ఇళ్ల స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అంశం... ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్లపై దాఖలైన పిటిషన్లన్నింటిపైనా విచారణను హైకోర్టు ముగించింది. అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణపై విచారణ జరపగా.. ఎల్ఆర్ఎస్పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బలవంతంగా అమలుకు చర్యలు చేపట్టవొద్దని ఆదేశించిన హైకోర్టు... సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దని స్పష్టం చేసింది.
సుప్రీంలో తేలే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపైనా తుదినిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా.. తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్పై దాఖలైన పిటిషన్లన్నింటి విచారణను ముగించింది.
ఇదీ చదవండి: 'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'