గాంధీ ఆస్పత్రిలో రేపటి వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి , కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. గాంధీలో వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో రేపు ప్రధాని మోదీ దృశ్య మధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలో డిజిటల్ తెరలను ఏర్పాటు చేయడంతోపాటు.. వాక్సినేషన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు.
వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల అపోహలు వద్దని డీఎంఈ రమేష్ రెడ్డి సూచించారు. వాక్సినేషన్ అన్ని విధాలుగా సురక్షితం అన్న ఆయన.. కొందరిలో జ్వరం, ఇంజక్షన్ ఇచ్చిన చోట ఎర్రగా మారినా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కిడ్నీ , గుండె జబ్బులు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వవచ్చన్న డీఎంఈ.. పిల్లలకు పాలిస్తున్న తల్లులు, గర్భిణులు , 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా తెలిపారు.
రక్తం గడ్డకట్టడంలో సమస్య ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వరని.. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఒక్కోసారి జర్వం వచ్చే అవకాశం ఉంటుందని డీఎంఈ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో సమస్యలు వస్తే చికిత్సకు కిట్స్‌ను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. వ్యాక్సినేషన్‌లో ఉన్నతాధికారుల సూచనలు పాటించాలని... వ్యాక్సినేషన్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.
ఇదీ చూడండి : మోసపోవద్దంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!