DK Shivakumar Campaign in Suryapet : బీఆర్ఎస్కు, బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకె శివకుమార్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం కేసీఆర్ అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ సభల్లో.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Congress Bus Yatra in Suryapet : బీఆర్ఎస్ మునిగే నావ అని.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో చేర్చుకోవాలని కేసీఆర్ అడిగినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్తో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పే సమయం ఆసన్నమైందని..ఈ ఉత్సాహం చూస్తుంటే ఆరునెలల క్రితం కర్ణాటకలో ఎదురైన ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, కోదాడలలో రోడ్‌షోలు, సభల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతికి మద్దతుగా.. సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, ఏపీపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజులతో కలిసి.. డీకే శివకుమార్ పాల్గొన్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఇచ్చిన హామీలన్ని అమలుచేస్తామని పునురుద్ఘాటించారు.
ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి
''బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీ ఓటును వృధా చేసుకోకండి. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి. రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా.. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్డ్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.'' - డీ.కె శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
Telangana Assembly Elections 2023 : కర్ణాటకలో సర్కార్ ఏర్పడిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఐదు గ్యారెంటీలపై ఉత్తర్వులిచ్చి వాటిని సమర్థంగా అమలు చేస్తున్నట్లు డీకె శివకుమార్ పునరుద్ఘాటించారు. అవసరమైతే కేసీఆర్, కేటీఆర్ అక్కడకి వచ్చి చూడొచ్చని మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుతో పాటు.. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నా సచివాలయానికి రాని కేసీఆర్‌ను.. శాశ్వతంగా ఫాంహౌస్‌కు పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్, కోదాడ రోడ్‌షోలకు పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానులు.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం అంటూ.. నినాదాలు చేస్తూ సందడి చేశారు.
''డిసెంబర్ 9న సోనియా పుట్టిన రోజున ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చింది. ఈ డిసెంబర్ 9నే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తుంది. పదేళ్ల పాటు కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫాం హౌస్‌లోనే పడుకున్నారు. ఇప్పుడు శాశ్వతంగా ఫాంహౌస్‌కే పరిమితం చేద్దాం.'' - డీ.కె శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి