DK Aruna MLA Gazette : హైకోర్టు తీర్పునకు లోబడి గద్వాల శాసనసభ్యురాలిగా డీకే అరుణను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఎన్నికల విభాగం గెజిట్ నోటిఫికేషన్న ముద్రించినట్లు తెలిసింది.
DK Aruna As Gadwal MLA Gazette : హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను శాసనసభ్యురాలిగా ప్రమాణం చేయించేందుకు ఆహ్వానించాలని డీకే అరుణ ఇప్పటికే శాసనసభాపతి, అసెంబ్లీ కార్యదర్శిని కోరిన విషయం తెలిసిందే. లిఖితపూర్వకంగా తన వినతిని వారి కార్యాలయాల్లో అందించారు. ఈ నేపథ్యంలో సభాపతితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని డీకే అరుణ కోరారు.
DK Aruna Submits Judgement Copy : నన్ను MLAగా గుర్తించండి : డీకే అరుణ
తీర్పు అనంతరం అసెంబ్లీకి వెళ్లిన డీకే అరుణ : హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం డీకే అరుణ శాసనసభకు వెళ్లారు. అక్కడ శాసనసభ స్పీకర్, కార్యదర్శిని కలిసి కోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఆ పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బండ కార్తీక తదితరులు వెళ్లారు. అంతకు ముందు రోజు అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శులకు సమాచారం అందించిన అందుబాటులో లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతసేపు నిరీక్షించిన వారు రాకపోవడంతో.. అసెంబ్లీ కార్యాలయంలో తీర్పు కాపీని ఇచ్చి వెళ్లారు.
TS Govt Issued Gazette Of Gadwala MLA DK Aruna : అంతకు ముందు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌ను కలిసిన డీకే అరుణ.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టు తీర్పును అందించారు. ఆ రోజు డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, పార్టీ నేతలు ఆయనను కలిశారు. హైకోర్టును ఇచ్చిన తీర్పు ప్రతులను వికాస్‌రాజ్‌కు అందించారు. అందుకు సమాధానంగా త్వరలోనే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి.. సమాచారం ఇస్తారని తెలిపినట్లు డీకే అరుణ చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేస్తారన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఆయనపై వేటు వేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున రూ.2.50 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇలానే అంతకు ముందు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Telangana High Court Shock TO Gadwala MLA : "డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. నేను ప్రజల మనిషిని"