ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ప్రత్యేక కార్యాచరణతో అధికారులను నియమించి అవకాశాలు ఉన్న అన్ని ప్రభుత్వ భవనాల్లో ధాన్యాన్ని నిల్వచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ రైతు గోస భాజపా పోరు దీక్షలో భాగంగా దీక్షకు దిగారు.
లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం అయిన సందర్భంగా రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని డీకే అరుణ తెలిపారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరణకు నిబంధనలు సడలించినా కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీకే అరుణ వివరించారు.