Telangana Clean Survey Awards 2023: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి చెందిన జిల్లాలు మరోమారు అగ్రస్థానంలో నిలిచాయి. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికానికి సంబంధించి రెండు కేటగిరీల్లోనూ రాష్ట్రానికి చెందిన జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. 4 స్టార్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, పెద్దపల్లి జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
త్రీ స్టార్ కేటగిరీలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలవగా, జగిత్యాల రెండో స్థానంలో నిలిచింది. ఫోర్ స్టార్ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినందుకు సిరిసిల్ల జిల్లా బృందాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తోపాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులను మంత్రి ప్రశంసించారు.
Clean Survey Awards 2023: గతంలో ధృడ సంకల్పంతో అద్భుతం ఆవిష్కరించారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డుల్లో 4 స్టార్ కేటగిరీలతో.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతాన్ని మార్చుకుని ఘనమైన వర్తమానం సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయపరంపరలో తాజా పురస్కారాలు కూడా చేరాయని మంత్రి తెలిపారు.
-
Congratulations Team Rajanna Siricilla led by @Collector_RSL 👍
— KTR (@KTRBRS) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
My compliments to All Sarpanchas, Panchayat Secretaries, MPOs and District officers 👏 https://t.co/DneziAnvwT
">Congratulations Team Rajanna Siricilla led by @Collector_RSL 👍
— KTR (@KTRBRS) February 28, 2023
My compliments to All Sarpanchas, Panchayat Secretaries, MPOs and District officers 👏 https://t.co/DneziAnvwTCongratulations Team Rajanna Siricilla led by @Collector_RSL 👍
— KTR (@KTRBRS) February 28, 2023
My compliments to All Sarpanchas, Panchayat Secretaries, MPOs and District officers 👏 https://t.co/DneziAnvwT
ఈ గెలుపుకు కారణమైన సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జిల్లా అధికారులు, సర్పంచి, వార్డుమెంబర్లు, క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ సెక్రటరీతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరునా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడంతోనే ఇవాళ దేశవ్యాప్తంగా సిరిసిల్ల పేరు ప్రముఖంగా వినిపిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్న వారందరికి ఈ పురస్కారం అంకితమని పేర్కొన్నారు.
Swach Sarvekshan Awards 2023: ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు. ఈ సందర్భంగా.. తాజా పురస్కారాలపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇందుకు గాను.. మీ నిరంతర మార్గదర్శకం, సహకారం వాళ్లే ఇది సాధ్యమైందంటూ కలెక్టర్ ట్వీట్ చేశారు.
స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 నవంబరు నెలలో ఇచ్చిన పారా మీటర్లు ఆధారంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. ఓడీఎఫ్ ప్లస్ నమూనాలు మార్గదర్శకాలకు అనుగుణంగా గృహ స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించు కోవడం జరుగుతుంది. అన్ని సంస్థల్లో మరుగుదొడ్ల వినియోగం, గ్రామాల్లో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణలు, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాల్లో మురుగు నీటి నిర్వహణ, గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడం, పారిశుద్ధ్యానికి సంబంధించి వాల్ పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కేంద్రం ఈ పురస్కారాలు ఇచ్చింది.
ఇవీ చదవండి: