స్పుత్నిక్-వి వాక్సిన్ మొదటి డోసుకు సంబంధించి ట్రయల్‌రన్‌లో భాగంగా 50 వేల మంది వరకు వ్యాక్సిన్ అందించనున్నామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వాక్సిన్ సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆవిష్కరించారు.
అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్‌ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ సీఈవో ఎంవీ రమణ హైదరాబాద్, విశాఖపట్నంలో ఏకకాలంలో ప్రారంభించారు. టీకాల నిల్వ, సరఫరా వంటి వాటిని బేరీజు వేసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని వారు వెల్లడించారు.
" దేశంలో అతి ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు కృషి చేస్తాం. 63 దేశాల్లో స్పుత్నిక్‌కు ఆమోదం ఉంది. అపోలోలో స్పుత్నిక్ టీకాకు రూ.1200 నుంచి రూ.1250 వరకు ఛార్జ్ చేస్తాం."
-ఎంవీ రమణ, డాక్టర్ రెడ్డీస్ సీఈవో
ఇదీ చూడండి: వారిలో ఆసుపత్రి అవసరం 0.06% మందికే!