మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆదేశాల మేరకు మూడో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కును శుభ్రం చేశారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. అలాగే అలంకరణ పూల కుండీలలో నిల్వ ఉన్న నీళ్లను తీసేసి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, రామ్ నగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, అడిక్మెట్ కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి ఉన్నారు.
వీధుల్లో చెత్తను తొలగించే సిబ్బందికి, చెత్త రిక్షా కార్మికులకు ఉచితంగా రిక్షాలను పంపిణీ చేశారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'