ETV Bharat / state

Podu Lands Patta Distribution : జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ - జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ

Distribution Of Podu land Titles
Distribution Of Podu land Titles
author img

By

Published : May 23, 2023, 8:21 PM IST

Updated : May 24, 2023, 6:33 AM IST

20:15 May 23

Podu Lands Patta Distribution : జూన్ 24 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

Podu Lands Patta Distribution : పోడు భూములు పట్టాల పంపిణీకి ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేసింది. వచ్చే నెల 24 నుంచి 30వరకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పోడు పట్టాలు పొందిన రైతులకు... రైతుబంధు కూడా వర్తించేయాలని ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరగా తయారు చేయాలని ఆదేశించారు.

జూన్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా పోడు పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతుబంధు వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మిగతా రైతులకు అందుతున్న తరహాలోనే వీరికి కూడా రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం కేసీఆర్... ప్రభుత్వమే బ్యాంకు ఖాతా తెరిచి పోడు పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. కొత్తగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థికశాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈనెల 25వ తేదీన కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మంత్రులు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలు సమావేశంలో పాల్గొననున్నారు. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాస యోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి... అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించే గృహలక్ష్మి పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

జులై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. జులైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీన వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2 వేల పడకలతో కొత్తగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 24, 2023, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.