హైదరాబాద్లో శాంతిగిరి ఆశ్రమం, ఎన్ఎండీసీ సంయుక్తంగా పదివేల ఔషధ మొక్కల పంపిణీ చేపట్టాయి. ఎన్ఎండీసీ ఛైర్మన్, డైరెక్టర్ సుమిత్, స్వామీజీ ప్రాణవసుదన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులకు ఔషధ మొక్కలతో పాటు సేంద్రియ ఎరువులను అందించారు.
ఇదో మంచి కార్యమని.. అందులోనూ చిన్నారులను భాగస్వామ్యం చేయడం సంతోషకరమైన విషయమని సుమిత్ అన్నారు. ఔషధ మొక్కల గొప్పతనాన్ని నలుదిక్కుల చాటిచెబుతున్న శాంతిగిరి ఆశ్రమానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీచూడండి: కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!