హైదరాబాద్ మియాపూర్లోని కంటైన్మెంట్లో విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ఎంజీఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం అందించింది. దాదాపుగా 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, పప్పులు ట్రస్ట్ ఛైర్మన్ గంగాధర్ రావు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సేవ మరువలేనిదని ఆయన కొనియాడారు. లాక్ డౌన్ కాలంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి రోజు అన్నదానం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెరాస నేత శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్