కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతోన్న లాక్ డౌన్లో ఆకలితో ఎవరూ ఉండకుండా దక్షిణ మధ్య రైల్వే రైల్వే 'ఫీడ్ ద హంగర్' పేరిట ఆహారం అందిస్తోంది. రైల్వే జోన్ పరిధిలో సుమారు 2 లక్షల 8 వేల భోజనాలను అందించినట్లు తెలిపింది. ఇందులో 60వేల భోజనాలను ఐఆర్సీటీసీ.. మిగతా వాటిని రైల్వే పోలీస్ శాఖ, తదితర విభాగాలు అందించాయని ఎస్సీఆర్ రైల్వే పేర్కొంది. రైల్వేలకు అనుబంధంగా ఉండే... గుర్తింపు ఉన్న రైల్వే కూలీలు, సఫాయి కర్మాచారీలు కూడా భోజనాలు అందిస్తున్నట్లు జోన్ ప్రకటించింది. మొత్తం ఆహార పంపిణీని.. సామాజిక వంట కేంద్రాలు, ప్యాకింగ్, రవాణా , అవసరం ఉన్న వారి గుర్తింపు, సమయానికి సరఫరాలను విభాగాలను విభజించినట్లు అధికారులు తెలిపారు. ఆహారం అందించే సమయంలో భౌతిక దూరం తప్పనిసరి పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
'ఫీడ్ ద హంగర్' పేరిట దక్షిణ మధ్య రైల్వే ఆహారం పంపిణీ - ఆకలితో ఉన్న వారికి దక్షిణ మధ్య రైల్వే ఆహారం పంపిణీ
లాక్ డౌన్ వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితమైన వారికి సహాయం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే 'ఫీడ్ ద హంగర్' పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. రైల్వే శాఖ కిచెన్లు 24 గంటలు పనిచేస్తున్నట్లు చేస్తున్నాయని... వలస కార్మికులు, దినసరి కూలీలను స్పష్టంగా గుర్తించి వారికి ఆహారాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.