కొవిడ్-19పై పోరులో విధుల్లో పాల్గొనే వారిని కాపాడుకుంటామని టీఎన్‌జీఓ అధ్యక్షుడు కారెం రవీందర్ అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో వైద్యారోగ్యశాఖ కృషి అభినందనీయమని కొనియాడారు. టీఎన్‌జీవో యూనియన్ డీఎం అండ్ హెచ్‌ఎస్ యూనిట్ అధ్వర్యంలో కోఠిలోని పారిశుద్ద్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా నిత్యావసరాలను అందజేసినట్లు రవీందర్ పేర్కొన్నారు. 70మందికి పది రోజులకు సరిపడా సరుకులను పంపిణీ చేశామని... ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు.
ఇవీ చూడండి : సైకిళ్లపై తిరుగుతూ పోలీసుల లాక్డౌన్ విధులు