కరోనా లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దినసరి కూలీలకు, పేద గంగపుత్రులకు అరుంధతీనగర్ బెస్త సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, మంచి నూనె, కారం, పసుపు తదితర కిరాణా వస్తువులను సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ బెస్త అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం సహకారంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని ప్రకాశ్ తెలిపారు.
భౌతిక దూరం కొనసాగించాలి...
లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించినప్పటికీ ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని టీఆర్జీఎస్ అధ్యక్షుడు కరంకొండ యాదగిరి బెస్త విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్జీఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు మెట్టు ధన్రాజ్ బెస్త, అరుంధతి నగర్ గంగపుత్ర సంఘం గౌరవ అధ్యక్షుడు సంగయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడు రాజు, నర్సింగ్, ఉపాధ్యక్షులు నవీన్, రఘు తదితరులు పాల్గొన్నారు.