ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రులకు 200 పడకలు వితరణ చేసిన రోటరీ క్లబ్​

author img

By

Published : May 23, 2021, 4:06 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా రెండో దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. దీంతో బెడ్ల కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.25 లక్షల విలువ చేసే రెండు వందల స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు అందించారు.

Distribution of beds to hospitals
రోటరీ క్లబ్​ తరుఫున ఆస్పత్రులకు పడకల వితరణ

ప్రస్తుతం కొవిడ్​ రోగుల కారణంగా ఆస్పత్రుల్లో పడకల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొరతను తీర్చేందుకు తమ వంతు సాయంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సుమారు రూ.25 లక్షల విలువ చేసే రెండు వందల స్ట్రెక్చర్ బెడ్లను గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు అందించినట్లు... రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ హనుమంత్ రెడ్డి తెలిపారు.

వీటిలో 50 పడకలను ఉస్మానియా ఆసుపత్రికి, 50 గాంధీ ఆసుపత్రికి అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దాతల సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్ట్రెక్చర్ బెడ్స్ అందజేస్తామని తెలిపారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను అభినందనీయమన్నారు.

ఇదీ చదవండి: అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.