గ్రేటర్ హైదరాబాద్‌లో 11 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆహార భద్రత కార్డు ఉన్న మహిళలకు చీరలు అందేలా చూడాలన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆస్తిపన్ను వసూళ్లు, వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. భారీవర్షాల నేపథ్యంలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యర్థాల తొలగింపునకు అక్టోబర్ నుంచి అదనపు వాహనాలను కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్ లోకేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవీచూడండి: గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావుండొద్దు: మంత్రి తలసాని