భాజపా రాష్ట్ర కార్యాలయంలో అసమ్మతి నేతలు ధర్నా నిర్వహించారు. మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉమామహేందర్ పేరు లేదంటూ ఆయన అనుచరులు ధర్నాకు దిగారు.
గోషామహాల్-గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా పాండు యాదవ్‌ను పార్టీ ప్రకటించింది. పాండు యాదవ్‌ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు అక్కడకు చేరుకుని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
ఇదీ చూడండి : దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు నరకయాతన పడ్డ గర్భిణి