ETV Bharat / state

Assembly Sessions: టౌటింగ్ బిల్లుతో పాటు జీఎస్టీ చట్టసవరణబిల్లుపై చర్చ - Telangana latest updates

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి పనులపై శాసనసభ(Assembly)లో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో హరితహారం(Haritaharam)పై చర్చ చేపడతారు. టౌటింగ్ బిల్లుతో పాటు జీఎస్టీ చట్టసవరణబిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తారు. శుక్రవారం శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులపై మండలిలో ఇవాళ చర్చ జరుగుతుంది.

Assembly
శాసనసభ
author img

By

Published : Oct 4, 2021, 5:02 AM IST

రెండు రోజుల విరామం అనంతరం ఉభయసభ(Assembly Sessions)లు ఇవాళ తిరిగి సమావేశం కానున్నాయి. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, హైదరాబాద్ పాతబస్తీలో అభివృద్ధి పనుల(Old City Development Works)పై అసెంబ్లీలో చర్చ చేపడతారు. శుక్రవారం శాసనసభలో పూర్తైన హరితహారంపై ఇవాళ కౌన్సిల్​లో చర్చ జరుగుతుంది.

మరో రెండు బిల్లులపై...

మరో రెండు బిల్లులపై ఇవాళ శాసనసభ(Assembly)లో చర్చ జరగనుంది. టౌటింగ్ చట్టం బిల్లుతో పాటు జీఎస్టీ చట్టసవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చకు తీసుకుంటారు. శుక్రవారం అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీరాజ్, గృహనిర్మాణసంస్థ, నల్సార్, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లులపై మండలిలో చర్చకు చేపడతారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra reddy) ఉభయసభల ముందు ఉంచుతారు.

ప్రశ్నోత్తరాల్లో చర్చకు...

దళితబంధు పథకం, హైదరాబాద్​లో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్​లో దోమలు- ఈగల బెడద, రాష్ట్రంలో వంతెనల మంజూరు, షాద్​నగర్​కు ఐటీఐ తరలింపు అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. చెక్ డ్యాంల నిర్మాణం, ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాల అభివృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు, విద్యుత్ ఉత్పత్తి-వినియోగం, గ్రామీణ స్థానికసంస్థలకు నిధుల కేటాయింపు అంశాల్ని మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించనున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.