ETV Bharat / state

Polavaram Height: పోలవరం ఎత్తుపై కొత్త చర్చ..! - పోలవరం ఎత్తుపై కొత్త చర్చ

పోలవరం ఎత్తుపై కొత్త చర్చ మొదలైంది. 135 అడుగుల నీటి నిల్వ ఖర్చుపై ఆరా తీసింది కేంద్ర జలసంఘం. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర జలసంఘానికి అందజేసింది.

Polavaram Height
Polavaram Height
author img

By

Published : Feb 23, 2022, 7:37 AM IST

‘‘పోలవరం ప్రాజెక్టులో 135 అడుగుల ఎత్తు (+41.15 మీటర్లు)కు నీటి నిల్వను పరిమితం చేసేలా నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఆపై 150 అడుగుల ఎత్తు (+45.72 మీటర్ల) స్థాయికి నిర్మిస్తే ఎంత అవుతుంది’’ అన్న అంశాలపై కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టి సారించాయి. సంబంధిత గణాంకాలు, ఆ స్థాయిలలో నిర్మాణాలను పూర్తిచేస్తే కలిగే ప్రయోజనాలపై చర్చించాయి.

ఈమేరకు కేంద్ర జలసంఘంలో ప్రాజెక్టులు, వర్కుల విభాగం సభ్యుడు ఓరా, పోలవరం ప్రాజెక్టు సీఈవో ఎ.కె.ప్రధాన్‌ మంగళవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 45.72 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 150 అడుగుల ఎత్తున డ్యాం నిర్మించి 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనేది ప్రణాళిక. మొత్తం 322 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరివ్వడంతోపాటు 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడుతుందని లెక్కలు వేశారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాల్సి ఉంది. రూ.55,548.87 కోట్ల మేరకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలపగా, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ మాత్రం రూ.47,725.74 కోట్లకే ఆమోదం తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పెట్టుబడి అనుమతి ఇంకా రాలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలు మళ్లీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దకు వెనక్కి వచ్చి కొర్రీలపై కొర్రీలతో ఇంకా అక్కడే పెండింగులో ఉన్నాయి. పోలవరం సవరించిన అంచనాలకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఇదే సమయంలో... మంగళవారం నాటి సమావేశంలో పోలవరాన్ని +41.15 మీటర్ల స్థాయికి నిర్మించాలంటే రూ.10,900 కోట్లు, ఆపైన +45.72 మీటర్ల స్థాయికి నిర్మించాలంటే మరో రూ.21,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో మొదట 41.15 మీటర్ల స్థాయి ఎత్తుకు కాఫర్‌డ్యాం నిర్మించి ఆ మేరకు పునరావాసం పూర్తి చేసి తొలిదశలో ప్రయోజనాలు అందించాలని, ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి ప్రధాన డ్యాం నిర్మించి పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంచాలన్న ఆలోచనతో ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుత ప్రభుత్వం 2023 నాటికి ప్రాజెక్టును మొత్తం పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇందుకు కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే... 2023 నాటికి మొత్తం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తరుణంలో +41.15 మీటర్ల స్థాయికి ఖర్చు ఎంత అన్న చర్చ సాగడం, దానిపై సమావేశం నిర్వహించడం గమనార్హం.

+41.15 మీటర్ల ఎత్తుకు ఖర్చుపై ఆరా

పోలవరం ప్రాజెక్టులో 135 అడుగుల ఎత్తు వరకు (+41.15 మీటర్లు) నీరు నిలిపి ఆ మేరకు పునరావాసం ఖర్చులు కూడా కలిపి ఎంత ఖర్చవుతుందని... ఆపై +45.72 మీటర్ల స్థాయికి నిర్మిస్తే ఖర్చు ఎంత అవుతుంది అన్న అంశంపై చర్చ జరిగింది. ఆ మేరకు నిర్మాణమూ, పునరావాసమూ పూర్తి చేయాలంటే రూ.10,900 కోట్లు ఖర్చవుతుందని లెక్కించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ స్థాయికి నిర్మాణం పూర్తి చేస్తే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, కృష్ణా డెల్టా కింద 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు, గోదావరి డెల్టాలో రబీ సాగుకు 10.13 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి ఆయకట్టుకు నీరు అందిస్తున్నందున ఆ ఖర్చు తొలగించి 135 అడుగుల ఎత్తుకు నీటిని నిల్వ చేస్తే ఎంత ఖర్చవుతుందో వివరాలు అందించాలని కేంద్ర జలసంఘం సభ్యుడు, పోలవరం అథారిటీ అధికారులు ప్రశ్నించారు. ఆ వివరాలు రూపొందించి పంపాలని కోరారు. ఇదే విషయంపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే ఇది సాధారణ సమావేశమేనని పేర్కొన్నారు. మొదట +41.15 మీటర్ల స్థాయి ఖర్చుకే పెట్టుబడి అనుమతి ఇస్తారా అని ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.