Digital India private limited company cheated the unemployed: హైదరాబాద్‌లో డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ... అమాయకులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇంటిదగ్గరే ఉంటూ యూకే నవలలను స్కాన్ చేసి ఇస్తే... లక్షలు సంపాదించొచ్చని ఆశ చూపింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఐదున్నర లక్షలు డిపాజిట్ చేస్తే... 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తామంటూ డబ్బులు వసూలు చేసింది. నెలకు మూడు లక్షలపైనే సంపాదించవచ్చని నమ్మబలికింది. అమిత్‌శర్మ అనే వ్యక్తి ఈ తతంగాన్ని ముందుండి నడిపించాడు.
నవలలను స్కాన్ చేసి పీడీఎఫ్‌గా మార్చి పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసి ఇవ్వడమే డ్యూటీ. ఇది నమ్మిన 625 మంది 11నెలల క్రితం కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండుమూడు నెలలు చెల్లింపులు బాగానే చేశారు. భారీగా డిపాజిట్లు వసూలయ్యాక.... ముఖం చాటేశారని బాధితులు తెలిపారు. డిజినల్ ఇండియా కంపెనీ ఎండీ అమిత్‌శర్మపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
అమిత్ శర్మ డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని అమిర్‌పేట్‌లో పెట్టారు. ఒక్క పేజీని స్కాన్ చేసి ఇస్తే.. 5 రూపాయలు ఇస్తారు. ఈజీ వర్క్.. హై సాలరీ అనగానే చాలా మంది డిపాజిట్ చేశారు. అందరికీ పెమేంట్స్ ఇచ్చేది ఉండగా.. నెక్ట్స్ డే నుంచి పరారీ అయ్యాడు. శనివారం వరకు కాంటక్ట్‌లో ఉన్నారు. సోమవారం కచ్చితంగా వేస్తామని చెప్పారు. మా ఫ్రెండ్స్‌కు పెమేంట్స్ వచ్చాయని మేం జాయిన్ అయ్యాం.. కానీ ఇప్పుడు నిలువునా ముంచి వెళ్లిపోయారు. - బాధితులు
ఇదీ చూడండి: త్వరలోనే గ్రూప్-4నోటిఫికేషన్.. మంత్రి క్లారిటీ