ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ (YSRCP MLA Jogi Ramesh)... ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి (Clash At chandrababu's house)కి వెళ్తున్నారన్న అంశంపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని డీఐజీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అయినప్పటికీ.. కరకట్ట మొదటి భద్రత అంచె వద్ద అడ్డుకున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి (Former CM Chandrababu naidu's house) పై దాడి (Clash At chandrababu's house) ఘటనంటూ బయట జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలను ప్రసారం చేశారని డీఐజీ ఆరోపించారు.
ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి (Attack on mla jogi ramesh car) జరిగిందని.. తర్వాత డ్రైవర్‌పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారంటూ డీఐజీ వీడియోలను ప్రదర్శంచారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని... ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానమిది కాదని అన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేర విచారణ జరుగుతోందని.. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు.
జోగి రమేశ్ (YSRCP MLA Jogi Ramesh) వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారు, దాడికి కాదు. ఎమ్మెల్యే జోగి రమేశ్ (YSRCP MLA Jogi Ramesh) రాకపై పోలీసులకు సమాచారం లేదు. సమాచారం లేకున్నా... జోగి రమేశ్(YSRCP MLA Jogi Ramesh)ను ముందే అడ్డుకున్నాం. మాజీ సీఎం (Former CM Chandrababu naidu's house) ఇంటిపై దాడి ఘటన పేరుతో ప్రచారం అవాస్తవం. ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ (YSRCP MLA Jogi Ramesh)కారు అద్దాలను రాయితో పగలగొట్టారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి 70 మంది హడావిడి సృష్టించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు వచ్చే విధానమిది కాదు. ఇరుపక్షాల ఫిర్యాదులపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. -తివ్రిక్రమ్ వర్మ, డీఐజీ
ఏం జరిగిందంటే..
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు.. ముఖ్యమంత్రి జగన్, హోం మంత్రి సుచరిత తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలతో కలిసి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ (YSRCP MLA Jogi Ramesh) చంద్రబాబు (Former CM Chandrababu naidu's house) నివాసం వద్దకు వెళ్లారు. వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించారు. ఆ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవటంతో లాఠీలు ఝళిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సమయంలో జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చేటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి కిందపడిపోయారు. తెదేపా నాయకుల ప్రతిఘటనతో చేసేది లేక జోగి రమేశ్..కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు రాళ్ల దాడిలో ధ్వంసం అయ్యింది. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాల వారినీ చెదరగొట్టి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: TENSION AT CHANDRABABU HOUSE: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
ycp protest: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద వైకాపా నేతల ఆందోళన