ETV Bharat / state

రాత్రిళ్లు గజ గజ.. పగటి పూట భగ భగ - Temperature in Telangana today

Temperature in Telangana : రాత్రిళ్లు గజ గజ.. పగటి పూట భగ భగ. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఇలానే ఉంటున్నాయి. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

weather-conditions
weather-conditions
author img

By

Published : Feb 14, 2023, 11:42 AM IST

Temperature in Telangana : రాత్రిళ్లు చలి.. సూర్యుడు వచ్చిండంటే కాక.. రాష్ట్రంలో కొద్దిరోజులుగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో చలి వాతావరణం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో నాలుగు జిల్లాలు మినహా మిగిలిన అన్నిచోట్లా 15 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇంకోవైపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Temperature change in Telangana : మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 22 తరువాత ఎండలు మొదలు కానున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా ఉంటుండగా.. మిగిలిన చోట్ల సాధారణానికి సమీపంలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ఈ నెల మూడో వారం నుంచి వేసవి కాలం ఎండలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్త శ్రావణి ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’కు వివరించారు. మరో రెండు రోజులు శీతల వాతావరణం కొనసాగుతుందన్నారు.

Telangana weather updates : సో.. రాష్ట్రంలో ఇంకో రెండు రోజుల పాటు రాత్రిళ్లు చలి.. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. రెండు రోజుల తర్వాత వేసవి కాలం ఎండలు ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ చెబుతోన్న వేళ.. ఈ రెండు రోజులు ఓపిక పడితే గజ గజ ఇక పోయినట్లేనన్నమాట.

ఇవీ చూడండి..

హిమాచల్​లో చలి పంజా.. గడ్డకట్టిన మంచినీరు.. పైపులను మండించి సరఫరా

అధిక జనాభా వరమా.. భారమా? భవిష్యత్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలి?

అప్రకటిత కరెంట్‌ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.