ETV Bharat / state

విభిన్న రకాల్లో కొవిడ్ రక్షణాత్మక దుస్తులు.. మీరూ ట్రై చేస్తారా? - పీపీఈ కిట్లు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేనిని ముట్టుకోవాలన్నా భయంగానే ఉంటుంది. అయితే సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఎస్​మార్క్​​ ఆర్​ఆర్​ టెండర్స్​ సంస్థ విభిన్న రకాలలో కొవిడ్​ రక్షణాత్మక దుస్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటో కింది కథనం చదివి తెలుసుకుందాం.

Different types of ppe kits made by ESS-mark
విభిన్న రకాలలో కొవిడ్ రక్షణాత్మక దుస్తులు.. మీరు ట్రై చేస్తారా?
author img

By

Published : Aug 31, 2020, 11:37 AM IST

Updated : Aug 31, 2020, 3:23 PM IST

విభిన్న రకాల్లో కొవిడ్ రక్షణాత్మక దుస్తులు.. మీరూ ట్రై చేస్తారా?

కొవిడ్​ వంటి మహమ్మారి నుంచి రక్షించుకోవడం కోసం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఎస్​మార్క్​ ఆర్​ఆర్​ టెండర్స్​ సంస్థ విభిన్న రకాలలో కొవిడ్​ రక్షణాత్మక దుస్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొవిడ్​ వచ్చినప్పుడు కేవలం పీపీఈ కిట్స్​ ప్రాధాన్యంతో కేవలం డాక్టర్​ కిట్స్​ మాత్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం వీటి ప్రాధాన్యత పెరగడం వల్ల వారి వారి అవసరాలకు అనుగుణంగా కొవిడ్​ రక్షణాత్మక దుస్తులను రూపొందిస్తున్నారు.

14 రకాల్లో...

ప్రస్తుతం ఎస్​మార్క్​ సంస్థ 14 రకాలైన కొవిడ్​ రక్షణాత్మక దుస్తులను రూపొందించి వాటిని దేశవిదేశాలలో విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వరకాంతం కలహర్ రెడ్డి తెలిపారు. 95 జీఎస్​ఎం ఫ్యాబ్రిక్​తో దుస్తులు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో వైద్యులకు, కరోనా పేషెంట్లకు, ఔట్​పేషెంట్​లకు, ఎమర్జెన్సీ ట్రావెల్స్... ఇలా 14 రకాలైన రక్షణాత్మక దుస్తులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తప్పనిసరైంది...

కరోనా రక్షణాత్మక దుస్తులు అనేవి తప్పనిసరి దుస్తులుగా మారిపోయిందని వివరించారు. మాస్క్​ను ఏ విధంగా ధరిస్తారో.. అదేవిధంగా కొవిడ్​ రక్షణాత్మక దుస్తులను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారని అందుకే వాటికి ప్రస్తుతం మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని తెలిపారు. రక్షణాత్మక కిట్స్​లో దుస్తులతో పాటు మాస్క్​, హ్యాండ్​ గ్లౌజ్​, పాదాలకు గ్లాజ్, తలకు సంబంధించిన క్యాప్​, శానిటైజన్​ ఇలా అన్ని రకాలైన వస్తువులను అతి తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు.

పది రూపాయల నుంచి 555 రూపాయల వరకు తమ వద్ద కిట్స్​ లభిస్తాయని కలహర్ రెడ్డి పేర్కొన్నారు. సామాన్యులు, ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారికి అనుగుణంగా వీటిని డిజైన్ చేసి అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చూడండి: సినీ పరిశ్రమతో డ్రగ్స్​ ముఠా లింకులపై ఆరా

Last Updated : Aug 31, 2020, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.