ETV Bharat / state

కరోనా కట్టడికి మేము సైతం అంటున్న పలు ప్రైవేటు సంస్థలు - ప్రగతి భవన్​

కరోనా కట్టడికి తమ వంతు సాయం అందించేందుకు పలు ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. ప్రభుత్వ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు మద్దతుగా సీఎం సహాయనిధికి చెక్కుల రూపంలో వివిధ సంస్థల అధిపతులు విరాళాలను అందజేశారు. మార్చి 31నే రూ. 8.72కోట్ల విరాళాలాలు వచ్చాయి.

different organizations donation to cm releaf fund in Hyderabad
మేము సైతం అంటున్న పలు ప్రైవేటు సంస్థలు
author img

By

Published : Apr 1, 2020, 6:40 AM IST

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా సీఎం సహాయనిధికి పలు సంస్థల అధిపతులు విరాళాలు అందజేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​కు అందజేశారు. కాగా మార్చి 31న సీఎం సహాయ నిధికి మొత్తం రూ.8.72 కోట్ల విరాళాలు వచ్చాయి. దివీస్ లేబటేరరీస్ తరఫున రూ.5కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విర్చా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్​లు చెరో రూ.కోటిని సీఎం సహాయ నిధికి అందించారు.

ఐఆర్​ఏ రియాల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ. 25లక్షలు, ఎంజీబీ కమోడీటీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ.20లక్షలు, మానవీయ డెవలప్​మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున రూ.20లక్షలను అందించారు. మాధవరం కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింథోచెమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓషన్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్స్, మిరియాల చిన్న రాఘవరావులు రూ.10లక్షల చొప్పున సహాయనిధికి ప్రకటించారు.

వీరితోపాటు మహేశ్వరి మైనింగ్ అండ్ ఎనర్జీ రూ.5లక్షలు, నిఖిల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ రూ.2లక్షల చెక్​ను మంత్రి కేటీఆర్​కు అందించారు. సుచిర్ ఇండియా ఇన్​ఫ్రాటెక్, ఐఆర్ఏ రియాలిటీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ.25 లక్షల చెక్కులను సీఎం సహాయనిధికి అందజేశారు. శాండిల్ ఉడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చండ్ర చంద్రశేఖర్ తెలంగాణాకు రూ.2లక్షలు, ఆంధ్రప్రదేశ్​కు 1లక్ష రూపాయలు అకౌంట్స్​కి బదిలీచేశారు.

ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.