ETV Bharat / state

వ్యాపార నాయకత్వంలో ఎనలేని సేవలు : హరీశ్​ రావు - dicci members meet minister harish rao

నూతన ఏడాది సందర్భంగా హైదరాబాద్​లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్​లను కలిసి తెలంగాణ డీఐసీసీఐ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వ్యాపార నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

dicci members meet minister harish rao
ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావును కలిసిన డీఐసీసీఐ బృందం
author img

By

Published : Jan 6, 2021, 9:43 PM IST

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ డీఐసీసీఐ బృందం ప్రతినిధులు హైదరాబాద్​లో మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​లను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వ్యాపార నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో వారి సేవలను మంత్రి కొనియాడారు.

ఎంఎస్​ఎంఈ రంగానికి తోడ్పాటును అందించేందుకు రాయితీలను సకాలంతో విడుదల చేయాలని మంత్రికి డీఐసీసీఐ బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. టీఎస్​ఐఐసీ భూమి వడ్డీరేట్లపై చర్చించినట్లు వారు తెలిపారు. తమ అభ్యర్థనలకు మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్, డీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు అరుణ దాసరి , రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు రమేష్ నాయక్, డీఐసీసీఐ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్, రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ అధ్యక్షుడు మున్నయ్య, రాష్ట్ర సమన్వయకర్త పరమేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి; పీఆర్సీని వెంటనే అమలు చేయాలి : టీపీయూఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.