ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పాటు పడటంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కృషి అభినందనీయమని డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్ అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు జీవో 59 సాధించడం, సింగరేణిలోనూ దళిత పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు కల్పించేందుకు ఎర్రోళ్ల శ్రీనివాస్ తీసుకున్న చొరవ దోహదపడుతుందని డిక్కీ కొనియాడింది.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి విశేష సేవలందిస్తోన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను డిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హరితప్లాజాలో ఘనంగా సన్మానించారు. ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా నిలబడేందుకు శక్తినిచ్చే కార్యక్రమాలను నిర్వహించేందుకు డిక్కీ అందిస్తోన్న సహకారం గొప్పదని ఈ సందర్భంగా ఎర్రోళ్ల కొనియాడారు.
ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు