ETV Bharat / state

ఆన్​లైన్​ రుణయాప్​లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక - DGP's report to the High Court on online loan applications

ఆన్​లైన్​ రుణయాప్​లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటిపై తీసుకున్న చర్యలపై ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ మహేందర్​ రెడ్డి నివేదిక సమర్పించారు. 290 రుణయాప్​లను గుర్తించి నిలిపివేసినట్లు డీజీపీ తెలిపారు.

dgp report to high court
హైకోర్టుకు డీజీపీ నివేదిక
author img

By

Published : Apr 15, 2021, 4:59 PM IST

ఆన్‌లైన్‌ రుణయాప్‌లపై తీసుకున్న చర్యలపై హైకోర్టుకు డీజీపీ మహేందర్​ రెడ్డి నివేదిక సమర్పించారు. రుణ యాప్‌లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటికి సంబంధించి 56 కేసులు నమోదు చేసి... రుణాల కోసం వేధిస్తున్న 118 మొబైల్ నంబర్లను గుర్తించినట్లు ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ వెల్లడించారు. 290 రుణ యాప్‌లను గుర్తించి నిలిపివేసినట్లు తెలిపారు.

ఈ మోసంలో భారత్‌తో పాటు చైనా, ఇతర దేశీయుల ప్రమేయం ఉందని... ఆర్బీఐ అనుమతి లేని రెండు ఎన్​ఎఫ్​బీఐలను గుర్తించినట్లు ధర్మాసనానికి డీజీపీ వివరించారు. అనుమతిలేని ఎన్​ఎఫ్​బీఐలపై ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు... మరిన్ని వివరాలతో 4 వారాల్లో మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా: నోముల భగత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.