దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వాళ్లను స్థానికంగా ఉండే కాలనీ, అపార్టుమెంట్ సంక్షేమ సంఘాలు గుర్తించే బాధ్యత తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ల ఆరోగ్యం గురించి సంక్షేమ సంఘాలు తెలుసుకోవాలని డీజీపీ కోరారు.
హైదరాబాద్ నగరంలో చౌకధర దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తుండటం సంతోషకరమని డీజీపీ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్న పోలీసులను ఆయన అభినందించారు. ప్రజలను కరోనా వైరస్ బారిన పడకుండా చూసేందుకు ముందు వరుసలో ఉంటున్న పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని మహేందర్ రెడ్డి సూచించారు.