ETV Bharat / state

DGP rejoined in duties: రెండు వారాల తర్వాత విధుల్లో చేరిన డీజీపీ - తెలంగాణ వార్తలు

DGP rejoined in duties: రెండు వారాల సెలవుల అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి విధుల్లో చేరారు. ఫిబ్రవరి 18న ఇంట్లో జారి కిందపడడంతో ఎడమ భుజం ఎముక విరిగింది. ఈ మేరకు దాదాపు పదిహేను రోజులు విశ్రాంతి తీసుకున్న డీజీపీ... ఇవాళ విధుల్లో చేరారు.

DGP rejoined in duties, dgp mahendar reddy
రెండు వారాల తర్వాత విధుల్లో చేరిన డీజీపీ
author img

By

Published : Mar 5, 2022, 3:11 PM IST

DGP rejoined in duties: డీజీపీ మహేందర్ రెడ్డి విధుల్లో చేరారు. రెండు వారాల సెలవు ముగియడంతో తిరిగి శనివారం విధుల్లో చేరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంట్లో జారి కింద పడటంతో మహేందర్ రెడ్డి ఎడమ భుజం ఎముక విరిగింది. దీంతో రెండు వారాల పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫిభ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహేందర్ రెడ్డి సెలవు పెట్టారు.

శుక్రవారం నాడు మహేందర్ రెడ్డిని మరోసారి పరిశీలించిన వైద్యులు... గాయం తగ్గినట్లు గుర్తించారు. ఇక విశ్రాంతి అవసరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్నాం: హరీశ్ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.