బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్తున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రకృతి నుంచి వచ్చే పూలతో పండుగ చేసే సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని... అది కేవలం తెలంగాణకే సొంతమని మహేందర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో ఇవాళ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతూ... మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండగ జరుపుకోవడం రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తుందని డీజీపీ తెలిపారు. మహిళా భద్రతా విభాగం ఇన్ఛార్జి, ఐజీ స్వాతి లక్రా ఉద్యోగినిలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పనితీరును వివరిస్తూ రూపొందించిన బతుకమ్మ పాటలు ఆకట్టుకున్నాయి.
ప్రకృతి పండుగ తెలంగాణ సొంతం: డీజీపీ మహేందర్ రెడ్డి - Dgp Office Bhathukamma celebrations today
ప్రకృతి నుంచి వచ్చే పూలతో పండుగ చేసే సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని... అది కేవలం తెలంగాణకే సొంతమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో ఐడీ స్వాతి లక్రా ఉద్యోగినిలతో కలిసి బతుకమ్మ ఆడి...వారిలో ఉత్సాహాన్ని నింపారు.