ETV Bharat / state

'పోలీస్​శాఖపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠినశిక్షలు'

లాక్​డౌన్​ కారణంగా విధుల్లో ఉన్న పోలీసులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వచ్చిన వార్త అవాస్తవమని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాంటి వార్తలను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

author img

By

Published : Apr 5, 2020, 8:03 PM IST

DGP office announces fake rumors on Police Department will punished
'పోలీస్​శాఖపై తప్పడు వార్తలు ప్రచారం చేస్తే కఠినశిక్షలు'

పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉన్న ప్రతిఒక్క పోలీసు అధికారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా వైరస్ నివారణ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు కొన్ని వాట్సాప్ గ్రూపులో వస్తున్న వార్తలు సత్య దూరమని డీజీపీ మహేందర్​రెడ్డి తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలు పంపే వారిని గుర్తించి చట్టరీత్యా తగు చర్యలు చేపట్టనున్నట్టు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: సొంతంగా మాస్కు​ తయారు చేసుకోవటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.