ఆపత్కాల సమయంలో వసతి గృహాల్లోని విద్యార్థులను, ఉద్యోగులను ఖాళీ చేయమనడాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వసతి గృహాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించవద్దని డీజీపీ కోరారు. నగర వ్యాప్తంగా వేలాదిగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా వసతి గృహాల నిర్వాహణ కొనసాగించాలని ఆదేశించారు.
వారితో సమన్వయం...
జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అనుమతి పత్రాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. తదుపరి అదేశాల వచ్చే వరకు ఎలాంటి అనుమతులు పనిచేయవని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు గుంపులుగా రావద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి : లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూపై సీఎం కేసీఆర్ సమీక్ష