లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని.. సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలన్నారు. వివాహాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని తెలిపారు.
రెండో డోసు వ్యాక్సిన్‌కు వెళ్లేవారిని, మొదటి డోస్ సమాచారం చూపించినవారిని అనుమతించాలని డీజీపీ వెల్లడించారు. నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలు, అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్‌లు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అత్యవసర ప్రయాణాల కోసం పాసులు తీసుకోవాలని డీజీపీ అన్నారు. policeportal.tspolice.gov.in ద్వారా ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 నుంచి 10 వరకు ప్రయాణాలకు పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. బయలుదేరే ప్రాంతం పరిధిలోని కమిషనరేట్‌కు ఈ పాస్ కోసం దరఖాస్తు చేయాలని వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్ 2.0... తాజా నిబంధనలు ఇవే..!