ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సేవలందించిన సూర్యనారాయణ భౌతిక కాయానికి డీజీపీ మహేందర్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పోలీసు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్యనారాయణ(85) సోమవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రానికి 1992 నుంచి 1994 వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు.