ఏపీలోని అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సత్యదేవుని దర్శనం కోసం ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలతో తల్లులు ఇబ్బందిపడుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం క్యూలైన్లలోని తూర్పు రాజగోపురం వద్ద తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించలేదు. కొండపై పార్కింగ్‌లో వందలాది వాహనాలు బారులు తీరాయి.
ఇవీ చదవండి: